ఏపీ పరిషత్ ఎన్నికల్లో 60.78 శాతం పోలింగ్ నమోదు

Friday, April 9th, 2021, 08:38:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జిల్లా, మండల ఎన్నికలు ముగిశాయి. ఈ పరిషత్ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 60.78 శాతం పోలింగ్ నమోదు అయినట్లు పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68.27 శాతం పోలింగ్ నమోదు కాగా, అతి తక్కువగా ప్రకాశం జిల్లాలో 51.68 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే మూడు జిల్లాల్లో, మూడు పోలింగ్ కేంద్రాల్లో నేడు రీ పోలింగ్ జరగనుంది అని గిరిజా శంకర్ తెలిపారు. అయితే స్థానిక ఎన్నికల్లో మొదటి నుండి వైసీపీ ఆధిక్యం లో ఉన్న సంగతి తెలిసిందే. పంచాయతీ, నగర, మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ సత్తా చాటింది. టీడీపీ, బీజేపీ, జన సేన లు చాలా తక్కువ స్థానాలకు పరిమితం కాగా, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ మరియు జన సేనలు బహిష్కరించిన సంగతి తెలిసిందే.