నిఘా మధ్య పోలింగ్ !

Tuesday, December 2nd, 2014, 09:40:08 PM IST


జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఐదు దశలలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి దఫా ఎన్నికలు గత నెల 25వ తేదీన జరిగింది. ఈ పోలింగ్ ను నిషేదిత తీవ్రవాద సంస్థలు బహిష్కరించినప్పటికీ.. ప్రజలు భారీ ఎత్తున పోలీంగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటింగ్ ను వినియోగించుకున్నారు. మొదటి దఫా ఎన్నికలలో దాదాపు 70శాతం పైగా పోలింగ్ జరిగింది. తీవ్రవాదులు హెచ్చరించినప్పటికీ… కాశ్మీర్ ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో…కొన్ని పార్టీలలో ఉత్సాహం కనిపించగా… కొన్ని పార్టీలకు భయం పట్టుకున్నది.

మొదటి దఫా ఎన్నికలు ఇచ్చిన స్పూర్తితో రెండో దఫా ఎన్నికలలో సైతం ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. ఈ రెండో దఫా ఎన్నికలను కూడా తీవ్రవాదులు బహిష్కరించిన విషయం తెలిసిందే. రెండో దఫా ఎన్నికలు ఉత్తర కాశ్మీర్ లోని ఐదు జిల్లాలో జరిగాయి. మొత్తం 18 అసెంబ్లీ స్థానాలకు 175మంది అభ్యర్దులు పోటీలో ఉన్నారు. ఇందులో కొదరు సిట్టింగ్ మంత్రులు కుడా ఉన్నారు. కాగ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మొదట పలచగానే సాగింది. సమయం గడిచే కొద్ది… ఓటర్లు భారులు తీరారు. ఇక సరిహద్దు జిల్లాలైన పూంచ్, కుప్వారాలలో దాదాపు 68 నుంచి 70శాతం ఓటింగ్ పోలైనట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో అయితే 80శాతం వరకు పోలింగ్ నమోదయిందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఎన్నికలకు భారీ బధ్రతను ఏర్పాటు చేశారు.