92 ఏళ్ల బామ్మ భరత నాట్యం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?

Tuesday, January 5th, 2016, 06:12:53 PM IST

ఈ కాలంలో 30 ఏళ్ళు వచ్చే సరికే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. గట్టిగా కిలోమీటర్ నడిస్తే నేలకు కరుచుకునే పరిస్థితి. అలాంటిది ఓ 92 ఏళ్ళ బామ్మ నడవటం కాదు.. పరిగెట్టడం కాదు ఏకంగా నాట్యం చేసింది. అదీ భరతనాట్యం. ఆ బామ్మ పేరు ‘భానుమతీ రావ్’.

92 ఏళ్ల ఈమె ఒకప్పుడు ప్రపంచ స్థాయి నాట్యకారిణి. ఆమె కృష్ణుడిని రమ్మంటూ తల్లి చేసే నాట్యాన్ని చక్కగా, హావ భావాలు కూడా తప్పకుండా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఈ వయసులో ఆమెకు వినికిడి లోపం, చూపు మందగించటం, జ్ఞాపక శక్తి తగ్గటం ఉన్నప్పటికీ ఆమె చేసిన ఆ నాట్యం చూసి ప్రేక్షకులు పొంగిపోయారు. ఈ నాట్యాన్ని ఆమె కుమార్తె మాయ సోషల్ సైట్లలో పబ్లిష్ చేసింది. ఇప్పటి వరకూ ఈ వీడియోకి 600,000 హిట్లు, 10,000 షేర్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంతలా వైరల్ అయిన వీడియో ఇదే.

వీడియో కొరకు క్లిక్ చేయండి: