మరోసారి క్లారిటీ ఇచ్చిన ‘అమీర్ ఖాన్’

Tuesday, January 26th, 2016, 01:46:06 PM IST


రంగ్ దె బసంతి సినిమా విడుదలై 10 సంవత్సరాలు గడిచిన సందర్బంగా చిత్ర బృందం నిన్న ఏర్పాటు చేసిన సభకు హాజరైన అమీర్ ఖాన్ మరోసారి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. గత సంవత్సరం నవంబర్ లో మత అసహనం పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపి ఇప్పటికీ ఆయన్ను వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న ఆయన మాట్లాడుతూ ‘ కొంతమంది ప్రజలు నా మాటలను అర్థం చేసుకున్నారు. కొంతమంది భాధపడ్డారు. భాధపద్దవారిని నేను అర్థం చేసుకోగలను.

కానీ దేశం విడిచి పోవాలనుందని నేనుకాని, నా భార్య కిరణ్ రావ్ కానీ అనలేదు. నేను ఈ దేశంలో పుట్టాను.. ఈ దేశంలోనే చనిపోతాను. ఏదైనా పనిమీద రెండు మూడు వారాలు పక్క దేశం వెళితేనే నాకు ఇంటి మీద బెంగ కలుగుతుంది. కొంతమంది కావాలనే నా మాటలను వక్రీకరించి నన్ను దేశం నుండి విడదీయాలని చూస్తున్నారు. నేను ఎప్పటికీ ఈ దేశం వాడినే’ అంటూ ఉద్వేగపూరితంగా మాట్లాడారు.