ఓ అభిమాని కోరిక తీర్చిన ‘అమీర్ ఖాన్’

Wednesday, December 23rd, 2015, 02:00:47 PM IST

బాలీవుడ్ స్టార్ ‘అమీర్ ఖాన్’ మరోసారి అభిమానుల పట్ల తన ప్రేమను నిరూపించుకున్నారు. అరుదైన జన్యు సంబందిత వ్యాది ప్రొజెరియాతో భాదపడుతున్న తన అభిమాని ‘నిహాల్ బిట్లా’ ను కలిసి ఆ బాలుడు కోరికను తీర్చారు. తన అభిమాన నటుడిని కలిసిన సందర్బంగా నిహాల్ బిట్లా మాట్లాడుతూ అమీర్ నటించిన ‘తారే జమీన్ పర్’ సినిమా తనకు జీవితం పట్ల ఆశను పెంచిందని తెలిపాడు.

తారే జమీన్ పర్ స్టార్ ను కలవాలని తనకు ఆశగా ఉందని నిహాల్ ఓ ఫేస్ బుక్ పోస్టు పెట్టగా అమీర్ ఖాన్ దాన్ని చూసి నిహాల్ గురించి తెలుసుకొని తనకు కూడా 14ఏళ్ల తన ప్రత్యేక అభిమానిని కలవాలని ఉందని తెలిపారు. తన అభిమానిని కలిసిన తరువాత అమీర్ ఆ ఫోటోలను తన మిగతా అభిమానులతో షేర్ చేసుకున్నారు. నిహాల్ బిట్లా కూడా అమీర్ ఖాన్ ను కలిసినప్పుడు ఆయనకు తానే స్వయంగా వేసిన వినాయకుడి పెయింటింగ్ ను బహుమానంగా ఇచ్చి తాను జీవితంలో కష్టాల్ని ఎదుర్కోడానికి తారే జమీన్ పర్ సినిమా ఎంతగానో సాయపడిందని..అమీర్ ఖాన్ ను కలవటంతో తన కోరిక తీరిందని ఆన్నాడు.