అమీర్ ‘పీకే’ లిస్టులో సచిన్ !

Friday, December 12th, 2014, 12:24:53 AM IST


ప్రముఖ బాలివుడ్ నటుడు అమిర్ ఖాన్ హీరోగా, రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో త్వరలో రాబోతున్న ‘పీకే’ సినిమా కోసం వేచి చూసే ప్రముఖ వ్యక్తుల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ చిత్రం కోసం సినీ అభిమానులతో పాటు, పలువురు క్రీడాకారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అమీర్ ఖాన్ పీకే సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తెలిపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ జాబితాలో సచిన్ వచ్చి చేరాడు. తన స్నేహితుడు నటించిన ‘పీకే’ విడుదల కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సచిన్ స్పష్టం చేశాడు.