తప్పు చేయబోమంటున్న చీపురు పార్టీ

Sunday, February 1st, 2015, 04:09:11 PM IST


2013లో ఢిల్లీ రాజకీయాలోనే కాదు… దేశ రాజకీయాలో సైతం సంచలనం సృష్టించిన సంవత్సరం. ముఖ్యంగా, మూడు సార్లు ఢిల్లీ పీఠంపై విజయకేతనం ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకుండా దెబ్బతిన్న సంవత్సరం కూడా అదే. అప్పుడే పుట్టిన ఆమ్ ఆద్మీపార్టీ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా అప్పటి అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడించింది. ఇక, అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై ఏఏపీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటిచేసి ఆమెను ఓడింఛి ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. సామాన్యుడి పార్టీగా, అవినీతిని అంతం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ… కేవలం 49 రోజులలోనే చేతులెత్తేసింది. కేంద్రంలో వాదనలు పెట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ తనకు వచ్చిన అవకాశాన్ని చేతులారా చేజార్చుకొని… ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అయితే, అలా చేసినందుకు ఆయన ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. తమ పార్టీ అప్పుడు చేసిన తప్పుకు ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఈసారి గతంలో చేసిన తప్పును చేయబోమని, తమను ఈసారి గెలిపిస్తే… ఢిల్లీ ప్రజలకు 24 గంటలు కరెంట్ అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇస్తున్నారు. ఇక 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు, ఇప్పుడు 2015 ఫిబ్రవరి 7న జరుగుతున్నా అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉన్నదని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.