ఎంపీ గారు ఫుల్లుగా మందు కొట్టి పార్లమెంటుకి వచ్చారట..!

Thursday, July 14th, 2016, 05:25:27 PM IST


గతంలో మద్యానికి బానిస అన్న ఆరోపణలను ఎదుర్కున్న సంగ్రూర్ నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ‘భగవంత్ మన్’ మరోసారి అదే మద్యం ఆరోపణలకు గురవుతున్నారు. ఈసారి ఆయన ఏకంగా మందుకొట్టి పార్లమెంటులోకి వచ్చారని, ఆయన వల్ల పంజాబ్ ప్రతిష్ట మంటగలిసిపోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కకెప్టెన్ అమరిందర్ సింగ్ అన్నారు.

భగవంత్ మన్ పై ఆరోపణలు రావడం ఇదేం తొలిసారి కాదు గతంలో కూడా ఆయన 2014 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికప్పుడు, లోక్ సభ సమావేశాలప్పుడు మద్యం తాగే హాజరయ్యేవాడని స్వయంగా ఆప్ పార్టీ నేత, ప్రస్తుతం బహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్ అన్నారు.