ఢిల్లీలో అధికారం దిశగా ఆప్

Tuesday, February 10th, 2015, 11:23:39 AM IST


ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారం చేపట్టే దిశగా పయనిస్తున్నది. సామాన్యుడి పార్టీ ఢిల్లీలో ఇప్పటికే 66 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఎన్నిక ఇక లాంచనంగానే కనిపిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి కేవలం ఇప్పటివరకు మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నది. కాంగ్రెస్ అసలు ఖాతా కూడా తెరవలేదు. ఢిల్లీప్రజలు స్పష్టమైన మార్పును కోరుకున్నట్టు ఈ ఎన్నికల ద్వారా మనకు తెలుస్తున్నది. ఢిల్లీ బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీలో దిగిన కిరణ్ బేడికూడా ఓటమి దిశగా పయనిస్తున్నది. ఢిల్లీలో ఆప్ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు పండచేసుకున్నారు. సామాన్యుడికి న్యాయం జరగాలంటే సామాన్యుడి పార్టీకి ఓటు వేయాలని ఢిల్లీప్రజలు నిర్ణయించారు. అందుకే ఆప్ పార్టీకి ప్రజలు ఓటు వేసినట్టు తెలుస్తున్నది.