సామాన్యుడు విస్తరిస్తున్నాడు..!

Sunday, February 15th, 2015, 07:31:15 PM IST


సామాన్యుడి పార్టీగా 2013లో ఢిల్లీ ఎన్నికలలో పోటీచేసి, తొలిప్రయత్నంతోనే 28 సీట్లు గెలుచుకోవడమే కాకుండా.. అప్పటి పరిస్థితులకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి 49రోజులపాటు పాలన సాగించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఢిల్లీని పూర్తీ రాష్ట్రంగా ప్రకటించాలని కోరుడమే కాకుండా… పాలనలో పారదర్శకత ఉండాలని అంటూ లోక్ పాల్ బిల్లును అమలులోకి తేవాలని పోరాటం చేశారు. కాని, లోక్ పాల్ బిల్లు పార్లమెంటులో ఆమోదం లభించినప్పటికీ పూర్తీ స్థాయిలో ఆమోదం లభించక పోవడంతో.. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. కేజ్రివాల్ ఎలాగైతే గెలిచి సంచలనం సృష్టించాడో… రాజీనామా చేసి కూడా అంతే సంచలనం సృష్టించాడు. ఇక, ఇది ఇలా ఉంటే.. ఈనెల 7వ తేదీన జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 67 స్థానాలలో విజయం సాధించి.. ఆప్ మరో సంచలనం సృష్టించింది. కాగా, ఇప్పుడు ఆప్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నది. రాబోయే ఐదు సంవత్సరాలలో నాలుగు రాష్ట్రాలలో విస్తరించాలని కంకణం కట్టుకున్నది. ప్రాంతీయ పార్టీగా విజయం సాధించిన ఆప్ జాతీయ పార్టీగా కూడా విజయం సాధిస్తుందని ఆపార్టీ సిద్దాంత కర్త యోగేంద్ర యాదవ్ అంటున్నారు. ఢిల్లీలో పారదర్శకమైన పాలనను అందించడమే తమ లక్ష్యమని అన్నారు యోగేంద్ర యాదవ్.