వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన డివిల్లీర్స్!

Sunday, January 18th, 2015, 06:06:33 PM IST

deviliyars
దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో రెండు ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టాడు. కాగా వన్డేలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ మరియు సెంచరీలను చేసి రికార్డు సృష్టించాడు. వివరాలలోకి వెళితే వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న వన్డే టెస్ట్ మ్యాచ్ లో విజృంభించిన డివిల్లీర్స్ 16 బంతుల్లో అర్ధ సెంచరీని, 31 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీని చేసి కొత్త రికార్డును సృష్టించాడు. అయితే ఇంతకు ముందు వరకు ఆ రికార్డు న్యూజిలాండ్ కు చెందిన ఆల్ రౌండర్ కోరే ఆండర్సన్ పేరు మీద ఉంది. కాగా ఆండర్సన్ 36 బంతుల్లో సెంచరీ చెయ్యగా తాజాగా డివిల్లీర్స్ 31 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఇక డివిల్లిర్స్ దెబ్బకు విండీస్ బౌలర్లు కకావికలం కాగా జోహేన్నస్ బర్గ్ లోని న్యూ వాండర్సన్ స్టేడియం బౌండరీలతో దద్దరిల్లింది.