టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ను అరెస్ట్ చేసిన ఏసీబీ

Friday, April 23rd, 2021, 08:45:48 AM IST

తెలుగు దేశం పార్టీ కి చెందిన కీలక నేత, మాజి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే గుంటూరు జిల్లాలోని చింతలపూడి లో ఆయన నివాసం వద్ద తెల్లవారు జామున పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఉదయం ఆయన ఇంటి వద్ద మోహరించారు. అయితే అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు ఆయనను తమ వాహనం లో తీసుకొని వెళ్ళారు. అయితే ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంఘం డెయిరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ సంస్థలో అక్రమాలు జరిగాయి అంటూ నరేంద్ర పై 408, 409, 418, 420, 465 సెకన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు.అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.