ఆప్ మహిళా నేతపై యాసిడ్ దాడి

Sunday, February 21st, 2016, 11:50:16 AM IST


సాధారణ మహిళల పైనే యాసిడ్ దాడులు జరుగుతున్నాయనుకుంటే ఇప్పుడు ఈ విష సంస్కృతి మహిళా రాజకీయ నాయకుల్ని సైతం కబళిస్తోంది. తాజాగా ఆప్ మహిళా నేతపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. రాయ్ పూర్ లో గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న ఆప్ మహిళా నేత సోని సోరి శనివారం సాయంత్రం తన అనుచరులతో కలిసి జగ్ దల్ పూర్ నుండి గీదం లోని తన ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

మార్గ మధ్యలో ఆమెను అతకాయించిన ముగ్గురు దుండగులు యాసిడ్ ను పోలిన రసాయనాన్ని ఆమె ముఖంపై చల్లి వెళ్ళిపొయ్యారు. అనంతరం ఆమెను గీదంలోని ఆసుపత్రికి తరలించగా.. ముఖంపై గాయాలేమీ కాలేదని.. దుండగులు వినియోగించింది పూర్తి స్థాయి యాసిడ్ కాకపోవడం వల్లే ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. సోని సోరి తెలిపిన వివరాల ప్రకారం దుండగులు ముగ్గురు ఒకే బైక్ పై వచ్చారని తెలుస్తోంది.