టీడీపీ ఎంపీలు సింహాలో లేక గుంటనక్కలో తిరుపతి ఉపఎన్నికలో ప్రజలే తెలుస్తారు – ఆదిమూలపు సురేష్

Thursday, April 1st, 2021, 02:23:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పని తీరు, పాలన విధానం పై అధికార పార్టీ కి చెందిన నేతలు, మంత్రులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పని తీరు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో భారీ మెజారిటీని తీసుకు వస్తాయి అని వైసీపీ కీలక నేత, మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టీడీపీ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఈ విషయం తెలీక ఆ పార్టీ నేతలు ఇంకా గెలుస్తామనే భ్రమల్లో బతుకుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అయిన అచ్చెన్నాయుడు వైసీపీ ఎంపీ లు గొర్రెలు అంటూ నోరు పారేసుకోవడం సరైన పద్దతి కాదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ఎంపీ లు సింహలో లేక గుంటనక్కలో తిరుపతి ఉపఎన్నిక లో ప్రజలే తమ ఓటు ద్వారా తెలుస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ను మీ స్వార్థం కోసం తాకట్టు పెట్టి, ప్యాకేజి కి కక్కుర్తి పడింది తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం కొవిద్ సెకండ్ వేవ్ రూపంలో మళ్ళీ తన ప్రతాపం చూపిస్తున్న సమయంలో స్కూళ్ళ లో నిబంధనలు పాటించకుండా విద్యార్థుల ఆరోగ్యం తో ఆడుకుంటే యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.