అద్వానీకి పదవిచ్చారు!

Thursday, September 18th, 2014, 09:27:15 AM IST


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని మూటగట్టుకునిఅధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పార్టీలో 70ఏళ్ళు దాటిన వారికి మంత్రివర్గ పదవులు లేవని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో పార్టీలో కురువృద్దుడైన ఎల్ కే అద్వానీకి ఎటువంటి పదవీ దక్కకుండా పోయింది. ఇక వయోభారం కారణంగా ఏ పదవీ దక్కని అద్వానీని లోక్ సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపధ్యంగా అద్వానీ అధ్యక్షతన ఈ కమిటీ లోక్ సభ సబ్యులకు సభలో పాటించాల్సిన నైతిక విలువలను సూచించడంతో పాటుగా ప్రవర్తనను కూడా పర్యవేక్షించనుంది. కాగా ఈ కమిటీలో తెలుగుదేశం ఎంపీ చామకూర మల్లారెడ్డి, అరుమోజితెవాన్, నినాంగ్ రింగ్, ప్రహ్లాద్ జోషీ, హేమంత్ తుకారాం, షేర్ సింగ్ గుబే, భగవత్ సింగ్ కోష్యారి, అర్జున్ రామ్ మెగ్వాల్, కరియా ముండే, భతృహరి, జయశ్రీ బెన్ పటేల్, సుమేధనాధ్, సరస్వతి, భోల్ సింగ్ లు సభ్యులుగా నియమింపబడ్డారు.