25 అడుగుల మంచు కింద 6 రోజులున్నా బ్రతికాడు..!

Tuesday, February 9th, 2016, 03:43:15 PM IST

manchu
అది ఎముకలు కొరికే చలి. అ చలిలో తిరగడమే కష్టం. అలాంటిది 25 అడుగుల మంచు కింద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 రోజులపాటు ఓ సైనికుడు చిక్కుకుని 7వ రోజు అతనితో ఉన్న 9 మందిలో 5 చనిపోయి.. 4గురు గల్లంతైనా అతను మాత్రం ప్రాణాలతో బయటపడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సరిగ్గా ఫిబ్రవరి 3న సియాచిన్ గ్లాసియర్ ప్రాంతంలో 19,600 అడుగుల ఎత్తులో 10 మంది భారత సైనికులు భయంకరమైన అవలాంచ్ లో చిక్కుకున్నారు. వారి ఆచూకీ కోసం 6 రోజులపాటు వెతికినా వారెవరూ కనిపించలేదు. చివరగా 6వ రోజున అ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా 10 మందిలో లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆశ్చర్యంగా ఆ మంచు కింద ప్రాణాలతో కనిపించాడని.. 5గురు సైనికులు చనిపోయారని, మరో 4గురి ఆచూకీ తెలియాల్సి ఉందని లెఫ్ట్ నెంట్ జనరల్ డీఎస్ హుడా తెలిపారు.