లక్షలోపు రుణమాఫీ ఖాయం

Tuesday, September 16th, 2014, 06:14:03 PM IST


తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉందని, ఏ బ్యాంకులో రైతులు లక్షలోపు ఋణం తీసుకున్నా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. లక్షలోపు రైతు రుణమాఫీ వల్ల తెలంగాణలో 35లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ లో 15వేల కోట్లు కేటాయిస్తున్నారని పోచారం వివరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ త్వరలో కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు గ్రీన్ హౌస్ వ్యవసాయాన్ని పోత్సహిస్తామని తెలిపారు. అందుకోసం 50% సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని పోచారం పేర్కొన్నారు. ఇక త్వరలో వెటర్నరీ డాక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి పోచారం శ్ర్తీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.