ఒత్తిడిని అధిగమించేందుకు అదే బెస్ట్ అట!

Monday, June 15th, 2015, 02:22:49 PM IST


భూమి, జల, వాయు మార్గాలన్నింటిలోనూ గగనంలో ప్రయాణించడం కాస్తంత రిస్క్ తో కూడిన విషయమేనని వేరే చెప్పనవసరం లేదు. ఇక ప్రయాణ సమయాన్ని తగ్గించి సులభంగా గమ్యానికి చేర్చడంలో నింగిలో ప్రయాణించే విమానాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ అందులో పనిచేసే సిబ్బంది మాత్రం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట. ఈ మేరకు వీరి ఒత్తిడిని తగ్గించేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది.

ఇక ఒత్తిడి ఉపసమనానికి యోగానే బెటర్ అని నిర్ణయించిన ఎయిర్ ఇండియా సంస్థ హైదరాబాద్ లోని ‘ఎయిర్ ఇండియా సెంటర్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్ మెంట్’ యూనిట్లో యోగా క్లాసులను ప్రారంభించింది. కాగా ఈ క్లాసులకు 80మంది పైలెట్లు, 300మంది క్యాబిన్ సిబ్బంది హాజరవుతున్నారట. ఇక ఆసనాలతో తమ సిబ్బంది ఉపసమనం పొందుతున్నారని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి ఉపసమనానికి ప్రజలు యోగా వైపే మొగ్గు చూపుతుండడం ఇక్కడ గమనార్హం.