ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు!

Thursday, February 26th, 2015, 04:42:35 PM IST


ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కాగా కోచి విమానాశ్రయంలో నేటి ఉదయం ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం టైర్ పేలిపోయింది. అయితే పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానానికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాగా మధ్యాహ్నం షార్జాకు వెళ్ళాల్సిన ఈ విమానం టైర్ పేలిపోవడంతో దీనిపై ఇంజినీర్లు పరిశీలన జరుపుతున్నారు. ఇక ఈ విమానంలో 161మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పైలెట్ గనుక అప్రమత్తంగా వ్యవహరించకుండా విమానాన్ని నియంత్రించక పోయినట్లయితే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు.