కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్య, సోనమ్!

Friday, April 17th, 2015, 09:45:03 PM IST


ప్రఖ్యాత 68వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మే 13వ తేదీ నుండి 24 వరకు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఫెస్టివల్ కు బాలీవుడ్ నటీమణులు ఐశ్వర్యా రాయ్ బచ్చన్, సొనమ్ కపూర్ లో హాజరు కానున్నారు. ఇక లోరియల్ బ్రాండ్ కు వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఇద్దరూ కలిసి కేన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై తళుక్కుమనబోతున్నారు. కాగా ఈ విషయాన్ని కాస్మోటిక్ బ్రాండ్ లోరియల్ తన ట్విట్టర్ ఖాతాలో ధృవీకరించింది. ఇక ‘సోనమ్ కపూర్, ఐశ్వర్య రాయ్ లు కేన్స్ 2015 రెడ్ కార్పెట్ పై కలిసి నడవబోతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.