సమాధానాలు దాటేస్తున్నారు : అక్బరుద్దీన్

Friday, November 14th, 2014, 05:45:03 PM IST


సభలో తాము లేవనెత్తిన సమస్యలపై సమాధానాలు చెప్పకుండా దాటేస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడారు. తెలంగాణ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తుంటే.. తెలంగాణకోసం ఎందుకు ఉద్యమం చేశారా అనిపిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరామని.. దానిపై ఎటువంటి స్పందన లేదని అన్నారు. విధ్యుత్ సమస్యలాగే…. రాష్ట్ర ఆర్ధిక సమస్యకూడా ఉన్నదని.. దాన్ని ఎందుకని బహిర్గతం చేయడంలేదో అర్ధంకావడంలేదని ఆయన తెలిపారు. శాసనసభలో ఆర్ధిక మంత్రి సమాధానాలు ఇవ్వకుండా విషయాలను దాచిపెడుతున్నాడని ఆయన మండిపడ్డాడు.