అసెంబ్లీలో రోజుకో సినిమా!

Wednesday, March 11th, 2015, 12:16:18 PM IST


తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంగా శాసన సభలో సమావేశాలు ఎలా జరుగుతున్నాయంటూ తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్బరుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘సభలో రోజుకో సినిమా చూపిస్తున్నారు. ఈ సినిమాలు చూడడం నావల్ల కాదు. నేను షారుఖ్, సల్మాన్ ఖాన్ చిత్రాలనైతేనే చూస్తాను’ అంటూ విమర్శించారు. కాగా మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం బయటకు వస్తున్న అక్బరుద్దీన్ భాజపా నేత కిషన్ రెడ్డి ప్రశ్నించగా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇక నిన్నటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలాలలో ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య ఎంత రచ్చ జరిగిందన్న విషయం తెలిసిందే.