పెప్సీకో ప్రచారకర్తగా అక్కినేని అఖిల్

Wednesday, December 10th, 2014, 12:15:16 PM IST

akhil

ప్రసిద్ధ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అక్కినేని అఖిల్ ప్రముఖ శీతల పానీయాల సంస్థ పెప్సికో దక్షిణాది ప్రచారకర్తగా మారారు. ఆ కంపెనీ ఉత్పత్తి అయిన ‘మౌంటెయిన్ డ్యు’ శీతల పానీయానికి ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ విషయమై పెప్సికో ఇండియా డైరెక్టర్ రుచిరా జైట్లీ మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో సంస్థ మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడానికి అఖిల్ మరియు తమిళ నటుడు ఆర్యతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. దీనిపై అఖిల్ స్పందిస్తూ చిన్నప్పటి నుండి పెప్సీ సంస్థ ప్రచార చిత్రాలంటే చాలా ఇష్టమన్నారు. ఎత్తైన ప్రదేశాలంటే కాస్త భయమని, ఈ ప్రచార చిత్రంతో అది కూడా మంచి అనుభవంగా మారిందని తెలియజేసారు.