మన ఇంటి పక్కన ఉండే వారు ఊరికేళుతూ ఇంట్లోని లైట్లను ఆపడం మర్చిపోతారు. అనుకోకుండా ఆవిషయం గమనించిన మనకు అరెరె ఇప్పుడెలా..? కరెంటు వృదాగా పోతోందే..అనుకుని కాస్త డిసప్పాయింట్ అవుతాం. కానీ ఎక్కడో ఉన్న మనిషి తన ఇంట్లోని లైట్లను ఆన్, ఆఫ్ చేసే అవకాశం మనకిస్తే..భలేగా ఉంటుంది కదూ.
అలస్కాకు చెందిన ఐటీ నిపుణుడు జాన్ ఉడ్స్ ఇలానే చేస్తుంటాడు. కొన్ని ప్రత్యేకమైన, సంతోషకరమైన సందర్బాలలో తన ఇంటికి అలంకరించిన లైట్లను ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా ఆపరేట్ చేస్తూ ఆయన సంతోషాన్ని షేర్ చేసుకొనే అవకాశం ఇస్తుంటాడు. ఈసారి క్రిస్మస్ కు కూడా అలాంటి చాన్సే ఇచ్చాడు. తన ఇంటికి అలంకరించిన లైట్లను ఇంటర్నెట్ కు అనుసంధానం చేసి ఓ వెబ్ లింక్ ను ఇచ్చాడు.
అందులోకి వెళితే ఆ లైట్లను ఆన్, ఆఫ్ చేసే ఆప్షన్లు ఉంటాయి. వాటితో మనం కూడా ఆ లైట్లను ఆన్, ఆఫ్ చేస్తూ అతనికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపోచ్చు. ప్రస్తుతం చాలా మంది ఇంటర్నెట్ యూజర్స్ ఇదే పని చేస్తూ జాన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీరు కూడా జాన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపాలనుకుంటే ఈ http://christmasinfairbanks.com లింక్ లోకి వెళ్ళిపొండి.