మా ఇద్దరికీ వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు – అలీ

Wednesday, February 24th, 2021, 01:12:33 PM IST

తెలుగు సినీ పరిశ్రమ లో పవన్ కళ్యాణ్ మరియు అలీ మధ్య న ఉన్న స్నేహం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ రాజకీయాల్లో మాత్రం భిన్న మార్గాలను ఎంచుకోవడం కారణం గా వీరిద్దరి పై పలు మార్లు టాలీవుడ్ లో చర్చలు జరిగాయి.అయితే అలీ కుటుంబంలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. ఆయితే పవన్ హాజరు కావడం తో అందుకు సంబందించిన ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ హాజరు కావడం పట్ల అలీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ ను కలవడం ఎంతో ఆనందం గా ఉందని అలీ తెలిపారు.సుస్వాగతం, తొలిప్రేమ చిత్రాలతో తమ స్నేహ బంధం ప్రారంభం అయింది అని, ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ 27 సినిమా లు చేస్తే 25 సినిమాల్లో తాను నటించిన విషయాన్ని అలీ గుర్తు చేశారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అజ్ఞాతవాసి చిత్రాల్లో నటించలేదు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఏడాది మా కాంబో లో సినిమాలు వచ్చే అవకాశం ఉందని అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు లేవు అని, రాజకీయ పరంగా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. కానీ మేమిద్దరం ఎప్పుడు ఒకేలా ఉన్నాం అని అలీ అన్నారు. పవన్ కళ్యాణ్ ను కలిసి దాదాపు ఏడాదిన్నర అవుతుంది అని, రాజకీయాలు, కరోనా కారణంగా అతన్ని కలవలేక పోయాను అని అలీ అన్నారు. అయితే మధ్యలో ఒకసారి కలవడానికి వెళ్తే పూణే వెళ్లారని తెలియడం తో తిరిగి వచ్చినట్లు తెలిపారు.