దేశవ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 11 రాష్ట్రాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా వాటి ఫలితాలు నేడు వెలువడ్డాయి. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలు కాగా మెజార్టీ మార్క్ 122 కంటే ఎక్కువగా 124 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకోగా, ఆర్జేడీ కూటమి 110 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. దీంతో తిరిగి బీహార్‌లో ఎన్డీఏనే అధికారాన్ని చేపట్టనుంది. ఇక పలు రాష్ట్రాలలో మొత్తం 57 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలను చూసుకుంటే..
* కర్నాటకలో 2 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 2 స్థానాలను బీజేపీనే దక్కించుకుంది.
* గుజరాత్లో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 8 స్థానాలను బీజేపీనే దక్కించుకుంది.
* యూపీలో 7 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 6 స్థానాలను బీజేపీ దక్కించుకోగా, ఒక స్థానాన్ని సమాజ్ వాద్ పార్టీ దక్కించుకుంది.
* ఛత్తీస్‌గడ్‌లో 1 స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఆ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.
* జార్ఖండ్‌లో 2 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా ఒక స్థానాన్ని కాంగ్రెస్, మరొక స్థానాన్ని జేఎంఎం దక్కించుకుంది.
* మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 20 స్థానాలు బీజేపీ దక్కించుకోగా, 8 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది.
* మణిపూర్‌లో 5 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 4 స్థానాలు బీజేపీ దక్కించుకోగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
* ఓడిశాలో 2 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా రెండింటిని బీజేడీ గెలుచుకుంది.
* నాగాలాండ్‌లో 2 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా ఒక స్థానాన్ని ఎన్డీపీపీ గెలుచుకోగా, మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
* తెలంగాణలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగగా బీజేపీ గెలుపొందింది.
* హర్యానాలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ గెలుపొందింది.