నాంది చిత్రం అందుకే హిట్ అయింది – నరేష్

Thursday, February 25th, 2021, 10:09:32 AM IST

చిన్న సినిమా గా విడుదల అయి, ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా నాంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ చిత్రం ఇంతటి విజయం సాధించడం తో చిత్ర యూనిట్ సక్సెస్ యాత్ర చేపట్టడం జరిగింది. అయితే ఈ యాత్ర లో చిత్ర యూనిట్ పాల్గొనడం జరిగింది. విజయవాడ లోని పడమట మీడియా సమావేశం లో అల్లరి నరేష్ తో పాటుగా వరలక్ష్మీ శరత్ కుమార్ తో పాటుగా చిత్ర యూనిట్ మాట్లాడింది. అయితే అల్లరి చిత్రం తో తనకి కామెడీ హీరో గా గుర్తింపు వచ్చింది అని, అయితే నరేష్ కామెడీ మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తాడు అనే నమ్మకం నాంది తో ప్రేక్షకులకి వచ్చింది అని నరేష్ అన్నారు. అయితే ఈ చిత్రంలో కంటెంట్ ఉన్న కారణంగా నే సినిమా హిట్ అయింది అని నరేష్ అన్నారు. అయితే ఇక పై కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తా అని వ్యాఖ్యానించారు. సందేశాత్మక చిత్రాలలో నటించాలని ఉన్నట్లు నరేష్ అన్నారు.

అయితే న్యాయవాది పాత్రలో అలరించిన వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ, నాంది చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు అని, వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు సక్సెస్ యాత్ర చేపట్టిన విషయాన్ని వెల్లడించారు. అయితే అన్ని రకాల వైవిధ్య పాత్రలు చేయాలన్నదే తన కోరిక అని వ్యాఖ్యానించారు వరలక్ష్మి శరత్ కుమార్.