కేరళ అడవుల్లోకి అల్లు అర్జున్…ఎందుకంటే?

Wednesday, February 17th, 2021, 04:48:16 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఇటీవల రంపచోడవరం లోని మారెడుమిల్లి లో షూటింగ్ జరుపుకుంది. అయితే కొద్ది రోజులు షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు కేరళ కి పయనం అయ్యారు. కేరళ అడవుల్లో జరగనున్న కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం అల్లు అర్జున్ కేరళ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ తన రేంజ్ రోవర్ కార్ లో వెళ్తున్న ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం లో హీరోయిన్ గా రష్మిక నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరెకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా ఆగస్టు 13 న విడుదల కానుంది.