ఏపీ సాయానికి అమిత్ షా హామీ!

Saturday, March 7th, 2015, 06:29:48 PM IST


కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి శనివారం ఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షడు అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో సుజనా చౌదరి మాట్లాడుతూ విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులను ఇవ్వాల్సిందిగా అమిత్ షాను కోరానని తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్రమోడీతో చర్చించి ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాల సాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు సుజనా చౌదరి తెలిపారు.

ఇక రాష్ట్ర విభజన నేపధ్యంగా ఆంధ్రప్రదేశ్ అపారంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల సమయంలో విభజన చట్టంలోని అన్ని హామీలను నేరవేస్తున్నామని చెప్పిన భాజపా పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖం చాటేసింది. ఇక ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా కేంద్ర వైఖరిపై విముఖతను చూపిస్తున్నాయి. ఈ నేపద్యంలో సుజనా చౌదరి ఏపీ తరపున అమిత్ షాను కలిసి ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీలను నెరవేర్చాల్సిందిగా విజ్ఞ్యప్తి చేశారు.