వొంగి వొంగి సలామ్ లు కొట్టారండోయ్..!?

Monday, May 23rd, 2016, 05:52:40 PM IST


తమిళనాడు ముఖ్యమంత్రిగా అమ్మ ప్రమాణస్వీకారం చేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ హాల్ లో జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి అతిరధ మహారదులు అంతా హాజరయ్యారు. ఇక గవర్నర్ హోదాలో రోశయ్య అమ్మ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఇదిలా ఉంటె, ఈ ప్రమాణ స్వీకారం ముందు, అమ్మ వేదికపైకి వస్తుండగా.. క్యాబినెట్ మంత్రులుగా నియమింపబడ్డ వారంతా వరసగా నిలబడి వొంగి వొంగి దణ్ణాలు పెట్టారు. గతంలో అమ్మ జైలుకు వెళ్ళినపుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ సెల్వం కూడా అమ్మకు వొంగి వొంగి సలాం కొట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమ్మకు భయపడి చేసినప్పటికీ, భక్తితో చేసినప్పటికీ.. అమాత్య హోదాలో ఉన్న నేతలు ఇలా చేయడం ఏమిటని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.