సాహసం చేయబోయి అనకొండ చేతికి చిక్కిన ‘షేన్ వార్న్’

Thursday, February 18th, 2016, 05:54:56 PM IST


ఆస్త్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఓ రియాలిటీ షోలో సాహసం చేయబోయి.. అనకొండ కాటుకి గురయ్యాడు. నెట్ వర్క్ టెన్ నిర్వహించిన ఒక రియాలిటీ షోకు అతిధిగా వెళ్ళిన వార్న్ ఓ టాక్స్ చెయ్యాల్సి ఉంది. అనులో భాగంగా షేన్ వార్న్ చేతులను వనక్కు కట్టివేసుకుని ముందుగా ఎలుకలు ఉండే గ్లాస్ టబ్ లోకి తలను దూర్చాలి. వార్న్ అలానే చేశాడు. ఇక రెండో భాగంగా అనకొండలుండే టబ్ లోకి తల పెట్టాలి.

వార్న్ ఏమాత్రం భయపడకుండా అనకొండల మధ్యలోకి తలను దూర్చాడు. ఇంతలో ఒక అనకొండ వార్న్ తలపై కాటు వేసింది. దాంతో అక్కడి వారంతా షాకయ్యారు. కానీ ఆ పాము విషపూరితం కాకపోవడం వల్ల, వార్న్ తలపై చిన్న గాయాలు మాత్రమే కావడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాము కాటువేసినప్పటికీ వార్న్ ఏమాత్రం తడబడకుండా టాస్క్ పూర్తి చేయడం విశేషమని షో నిర్వాహకులు అన్నారు.

వీడియో కొరకు క్లిక్ చేయండి