‘ముఖేశ్ అంబాని’ కొడుకు అలా అయిపోయాడేంటి..!

Sunday, March 20th, 2016, 03:32:35 PM IST


భారతీయ పారిశ్రామిక దిగ్గజం.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ తనయుడు ‘అనంత్ అంబాని’ ఇదివరకటిలా లేడు. పూర్తిగా మారిపోయాడు. ఇదివరకు సుమారు 140 కిలోల అధిక బరువుతో ఇబ్బందిపడే అనంత్ అంబాని ఇప్పుడు సగం బరువు తగ్గి 80 కిలోలకు చేరుకున్నాడట. ఈ మధ్యే సోమనాథ్ ఆలయాన్ని దర్శించికున్న అతడిని చూసిన పలువురు ఆటను అంబాని కొడుకేనా అనే సందేహంలో పడ్డారు. అంతలా మారిపోయాడు అనంత్ అంబాని.

క్రితం ఐపీఎల్ సీజన్ లో సైతం లావుగానే ఉన్న అనంత్ కొద్ది నెలల నుండి ఓ అమెరికన్ ట్రైనర్ దగ్గర బరువు తగ్గే శిక్షణ తీసుకుంటున్నాడట. ఆ శిక్షణలో భాగంగా రోజూ పదుల కిలోమీటర్లు పరిగెత్తడం.. కఠినమైన ఆహారపు నియమాలను పాటించడం వంటి వాటితో బాగా బరువు తగ్గాడట అనంత్ అంబాని.