విశ్లేషణ : మన జగనన్నది కొత్త అధికారం – కొత్త పాలన…

Friday, October 25th, 2019, 08:30:13 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అఖండమైన విజయాన్ని నమోదు చేసుకొని మరీ ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని సొంతం చేసుకున్నటువంటి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర పాలన విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ మరీ రాష్ట్రాభివృద్ధికై కృషి చేస్తున్నారు. కాగా ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ సృష్టించిన ప్రభంజనానికి మిగతా పార్టీలన్నీ కూడా చతికిల పడిపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అప్పటి అధికార టీడీపీ పార్టీ ని మరీ అంత దారుణంగా ఓడించిన ఘనత కేవలం వైసీపీ దే అని చెప్పాలి.

కాగా ఎన్నికల కంటే ముందు జరిపినటువంటి పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా, మరియు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజలందరి ప్రశంసలను పొందుతున్నాడు సీఎం జగన్. దానితో పాటే కొత్త కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నాడు సీఎం జగన్. ఈమేరకు పథకాలకు అవసరమైనటువంటి నిధులను కూడా విడుదల చేస్తున్నాడు సీఎం జగన్. అంతేకాకుండా పాలనలో తన తండ్రిని మించిపోతున్నాడని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు.

కాగా ఇటీవల అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు విపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నప్పటికికూడా అవేమి పట్టించుకోకుండ రాష్ట్ర పాలన విషయంలో, ప్రజల శ్రేయస్సుకై నిరంతరం పాటు పడుతూ కృషి చేస్తున్నాడు. ఇకపోతే తనను నమ్ముకున్నటువంటి నేతలందరికీ కూడా న్యాయం చేస్తూ వారి మెప్పు కూడా పొందుతున్నాడు. కాగా ఎన్నికల్లో విజయం సాధించిన నేతలతో పాటు ఓడిపోయిన నేతలకు కూడా సమన్యాయం చేస్తున్నాడు. కాగా కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టగా, మరికొందరికి మాత్రం నామినేటెడ్ పదవులు ఇస్తూ, అందరిని శాంత పరుస్తున్నాడు.

అయితే కొన్ని రాజకీయ సమీకరణాల వలన అన్యాయం జరిగిన నేతలెవరైనా ఉంటె వారికి నచ్చజెప్పి, వారికి కేబినెట్ హోదా కలిగిన పదవులను కూడా అప్పగిస్తున్నాడు సీఎం జగన్. ఇలా చెప్పుకుంటూ పొతే, నగరి ఎమ్మెల్యే రోజాకి మంత్రి పదవి వస్తుందని అందరు ఉహాలు. కానీ చివరి నిముషంలో తనకు మంత్రి పదవి కాకుండా ఒక నామినేటెడ్ పదవిని అప్పగించారు. తరువాత సినీ పరిశ్రమకు చెందిన పృథ్వీ, అలీ, మరికొందరికి ఇలా నామినేటెడ్ పెదవులని ఇస్తూ వారికీ తగిన గౌరవ మర్యాదలను కల్పిస్తున్నారు సీఎం జగన్.

ఇక ప్రజల విషయానికొస్తే… చేనేత కార్మికులని, ఆటో, క్యాబ్ డ్రైవర్లు అని, కిడ్నీ సంబంధిత రోగులని, రాష్ట్రంలోని రైతులని, ప్రజలు, పేదలు, వృద్దులు, ఇలా ఎవరిని కాదనకుండా అందరికి కూడా సరైన సదుపాయాలను అందిస్తూ, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తన సొంత వారిలాగా పరిగణిస్తూ అందరి సమస్యలను తీరుస్తూ అందరి మన్ననలను కూడగట్టుకున్నాడు సీఎం జగన్.. ఇలాంటి పనులన్నీ చేస్తూ రాష్ట్రంలోని ప్రజలందరి చేత తండ్రికి తగ్గ తనయుడు అని, మన జగనన్న అని ప్రేమగా పిలిపించుకుంటున్నాడు. అంతేకాకుండా ప్రజలందరి కోసం మూడు గానే ఆలోచిస్తూ వారందరికోసం కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టనున్నారు.

ఇకపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని, అక్రమాలను, గత ప్రభుత్వ హయాంలో మాజీ నేతలు మాజీ మంత్రులు పాల్పడ్డ దురాగతాలకు అడ్డు కట్ట వేసి వారి అవినీతిని బయటపెట్టేందుకు కొత్తగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కొత్త పునాదులు తవ్వారు. కాగా ఈ రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా అడుగంటి పోయిన ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచి, దాన్ని ఒక గాడిలో పెట్టి, రాష్ట్ర పాలనలో కొత్త శకానికి నాంది పలికాడు సీఎం జగన్. అయితే సీఎం జగన్ తీసుకున్నటువంటి ఈ చారిత్రాత్మక నిర్ణయం విజయవంతం అవడం వలన కేంద్ర మంత్రులతో సహా, కేంద్ర ప్రభుత్వం కూడా సీఎం జగన్ ని ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది.

ఇకపోతే పక్క రాష్ట్రాలతో కూడా సన్నిహిత సంబంధాలని దృడంగా ఏర్పరచుకొని, పొరుగు రాష్ట్రాలతో కూడా ఎలాంటి నీటి సమస్యలు రాకుండా, వాటిని అధిగమించాడనికి వారితో కొన్ని ప్రత్యేకమైన ఒప్పందాలని కుదుర్చుకొని మరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి సమస్యలు లేకుండా చేస్తున్నాడు. కాగా ఇకమీదట రాష్ట్రంలో నీటి సమస్య ఉండదని గ్రహించి, రాష్ట్రంలోని రైతులందరికీ కూడా పంట పండించడం కోసం వారికీ సహాయం అందించాడనికి, రైతు బందు పథకం ద్వారా సంవత్సరానికి రెండు దఫాలుగా ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఇకపోతే వరి పంటతో పాటే ఇతర పంటలకు సరైన గిట్టుబాటు ధరలని కూడా కల్పించాడనికి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

కాగా రాష్ట్రంలో తన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ప్రజలు ఎవరు కూడా తప్పు చేసిన కూడా ఉపేక్షించినా కూడా క్షమించేది లేదని, రాష్ట్రంలో అవినీతి అక్రమాలు ఎక్కడ కనిపించకూడదని సీఎం జగన్ ఇప్పటికే పలు సార్లు అధికారులను హెచ్చరించారు. కాగా ఈమేరకు తన క్యాబినెట్ కి సంబందించిన నేతలు కూడా ఇదివరకే కొన్ని పొరపాట్లు చేయగా, వారిని హెచ్చరించారని సమాచారం. కాగా రాష్ట్రంతో పాటు దేశంలో కూడా అందరికి ఆదర్శంగా నిలవాలంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సీఎం జగన్ తన నేతలకు అందరికి దిశానిర్దేశం చేశారని సమాచారం.

రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న ఈ కొద్దీ కాలంలోనే ఎన్నో కీలకమైన నిర్ణయాలని తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తీవ్రంగా కృషి చేస్తున్న సీఎం జగన్, ఇప్పటివరకైతే రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో మంచి పేరునే సంపాదించుకున్నారు. ఇకమీదట రాష్ట్రాభివృద్ధికోసం ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి మరి. ఇకపోతే ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు సృష్టించినటువంటి “రావాలి జగన్, కావలి జగన్” అనే సూత్రానికి మన సీఎం జగనన్న 100 శాతం న్యాయం చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది…