అనుష్క తరువాత.. లక్కి చాన్స్ అంజలీకే..!!

Monday, November 23rd, 2015, 05:10:40 PM IST


అరుంధతి.. రుద్రమదేవి సినిమాలు అనుష్కను స్టార్ హీరోయిన్ ను చేశాయి. ఇప్పుడు అనుష్క టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. అటు స్టార్స్ తో సినిమాలు చేస్తూనే.. అవకాశం వచ్చినపుడు లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నది. ఇక, ఇప్పుడు ఇదే బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్ పయనిస్తున్నది. కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత టాలీవుడ్ లో అడుగుపెట్టిన అంజలీకి మంచి డిమాండ్ ఉన్నది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆమెకు మంచిపేరు తెచ్చింది. ఇక, గీతాంజలి అనే లేడి ఓరియంటెడ్ సినిమా లో హీరోయిన్ గా చేసింది. హర్రర్ జానర్ లో వచ్చిన గీతాంజలి సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత చిత్రాంగద లో కూడా అంజలీ మెయిన్ రోల్ ప్లే చేసింది. సైంటిఫిక్ ధ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో… అనుష్క తరువాత.. టాలీవుడ్ లో అంజలీనే అంటున్నారు. ఇక ఇప్పుడు అంజలీ.. నీలకంఠ మాయా అనే సినిమాలో కూడా మెయిన్ రోల్ చేస్తుందట. స్టొరీ అంజలీకి బాగా నచ్చిందని.. అయితే, ఇంకా ఓకే చెప్పలేదని తెలుస్తున్నది.