అన్నాడీఎంకె అత్యవసర సమావేశం

Sunday, September 28th, 2014, 12:09:07 PM IST


తమిళనాడు తాజా పరిణామాల నేపధ్యంలో అన్నా డీఎంకె తదుపరి కార్యాచరణపై నేడు అత్యవసర సమావేశం కానున్నది. అక్రమఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగు సంవత్సరాలు జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఆమె.. పదేళ్ళపాటు.. ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధం విధించింది.

ఈ నేపధ్యంలో.. ఈ రోజు జరిగే అత్యవసర సమావేశం కీలకం కానున్నది. అమ్మ జయలలిత తదనంతరం.. తమిళనాడు సిఎంగా ఎవరిని నియమించాలనే విషయంపై ఈ సమావేశం జరగనున్నది. తమిళనాడు సిఎం రేసులో పన్నీర్ సెల్వన్.. పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. నాథమ్ విశ్వనాథన్, సెంథిల్ బాలాజీ మరియు షీలా బాలకృష్ణన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, జయలలితకు ఉన్న గుర్తింపు.. మిగతా నాయకులకు లేకపోవడంతో ఎవరు సిఎం పోస్టుకు ఎన్నికవుతారో అని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తమిళనాడులో తాజా పరిణామాల నేపధ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా.. రాష్ట్రమంతటా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రముఖంగా బీజేపి నేత సుబ్రహ్మణ్య స్వామీ ఇంటివద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. డీఎంకె కార్యాలయాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అలాగే, డీఎంకె నేతల ఇళ్ళవద్ద కూడా భద్రతను పెంచారు.