దేశంలో విజృంభిస్తున్న కరోనా…మరో 16,838 కేసులు…113 మరణాలు

Friday, March 5th, 2021, 12:04:19 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. కొత్తగా నమోదు అవుతున్న కేసులు 17 వేలకు చేరుతూ ఉండటం ప్రజలకి ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 7,61,834 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 16,838 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,11,73,761 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం ప్రజలను ఆందోళన కి గురి చేస్తోంది. మరో పక్క ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని వైద్యులు, నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మళ్ళీ వందకు పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 113 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,57,548 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 13,819 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,08,39,984 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 1,76,319 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.