ఏపీ లో మరో 139 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Thursday, January 21st, 2021, 06:28:35 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 49,483 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 139 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,86,557 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి లోనే ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో ఒక్కరూ కూడా కరోనా కారణం గా ప్రాణాలను కోల్పోలేదు. ఇప్పటి వరకూ 7,142 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే నిన్న ఒక్క రోజే 254 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 8,74,998 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,522 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.