భారత్ లో మరో 15,223 కేసులు…151 మరణాలు

Thursday, January 21st, 2021, 11:16:43 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో జరిపిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షఎల్లో 15,223 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,06,10,883 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం కాస్త ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి. అయితే వాక్సిన్ అందుబాటులోకి రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 151 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,52,869 కి చేరింది. నిన్న ఒక్క రోజే 19,965 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య దేశం లో 1,02,65,706 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 1,92,308 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.