ఏపీ లో మరో 158 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Monday, January 25th, 2021, 12:09:13 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 44,382 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 158 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి వారి సంఖ్య 8,84,115 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి కరోనా వైరస్ వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే గడిచిన 24 గంటల్లో ఒక్కరూ కూడా కరోనా వైరస్ కారణంగా ప్రాణాలను కోల్పోలేదు. అయితే కరోనా వైరస్ రికవరీ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 155 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 8,75,492 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,476 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.