తెలంగాణ లో మరో 168 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, March 3rd, 2021, 09:41:15 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 40,444 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 168 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,99,254 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రం లో నేడు ఒక్క కరోనా వైరస్ మృతి కూడా నమోదు కాలేదు. అయితే ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో 1,635 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలను కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో మరో 163 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య రాష్ట్రం లో 2,95,707 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 1,912 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఈ మహమ్మారి కి దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.