ఏపీ లో మరో 1,730 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, April 4th, 2021, 10:00:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజురోజుకీ ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల పట్ల రాష్ట్ర ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 31,072 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,730 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 9,07,676 కి చేరింది. అయితే మరొక పక్క రాష్ట్రం లో వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఐదుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 7,239 కి చేరింది. నిన్న ఒక్క రోజే 842 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 8,90,137 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 10,300 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.