కరోనా అప్డేట్ : భారత్ లో మరో 18,522 కేసులు…418 మరణాలు!

Tuesday, June 30th, 2020, 10:52:15 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఊహించని రీతిలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గడిచిన 24 గంటలలో 18,522 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే గత కొద్ది రోజులుగా 16 వేలకు పైగా వరుసగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,66,840 కి చేరింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజుకి వందల సంఖ్యలో బాధితులు మరణిస్తున్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 418 మంది ప్రాణాలను కోల్పోయారు. కొత్తగా నమోదు అయినా ఈ మరణాల తో మొత్తం భారత్ లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 16,893 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 13,099 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,34,822 కి చేరింది.

భారత్ లో ప్రస్తుతం 2,15,125 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటికే అన్ లాక్ డౌన్ 1 కారణంగా దేశం లో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. జూలై 1 నుండి అన్ లాక్ డౌన్ 2 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరి కొన్నంతికి మినహాయింపు లను ఇచ్చి, రాత్రి 10 నుండి ఉదయం 5 వరకు కర్ఫ్యూ విధించడం జరుగుతుంది. అయితే ఇంకా ఈ వ్యాధికి వాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకపోవడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.