తెలంగాణ లో మరోసారి భారీగా నమోదు అయినా కరోనా పాజిటివ్ కేసులు!

Wednesday, July 8th, 2020, 12:08:23 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,879 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే గత కొద్ది రోజులుగా ఇదే తరహాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసులతో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ మహమ్మారి సోకిన వారి సంఖ్య 27,612 కి చేరింది. అయితే నేడు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడుగురు మృతి చెందారు.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తెలంగాణ లో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 313 కి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో 1506 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 16,287 కి చేరింది. అయితే ప్రస్తుతం రాష్ట్రం లో 11,012 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే తెలంగాణ లో ఎక్కువ శాతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్ లో నే నమోదు అవుతున్నాయి. ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కేసులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.