తెలంగాణలో మరో 202 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Friday, January 15th, 2021, 11:12:26 AM IST

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 19,898 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 202 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,91,118 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఇద్దరు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,574 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 253 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,85,102 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 4,442 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ రేపటి నుండి అందుబాటులోకి రానుంది. కరోనా వాక్సిన్ అందుబాటులోకి రావడం తో దీని తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.