ఏపీ లో మరో 2,558 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Thursday, April 8th, 2021, 04:45:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 31,268 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,558 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 9,12,937 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల రాష్ట్ర ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఆరుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 7,268 కి చేరింది. నిన్న ఒక్క రోజే 915 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 8,90,756 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 14,913 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.