ఏపీ లో తగ్గిన కరోనా కేసుల సంఖ్య…మరో 37 మంది మృతి!

Monday, September 28th, 2020, 11:06:04 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది అని చెప్పాలి. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో 66,121 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 5,487 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6,78,266 కి చేరింది.అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో గడిచిన 24 గంటల్లో 37 మంది కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,745 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 7,210 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకోగా, ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 6,09,405 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 63,116 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.