భారత్ లో మరో 3,66,161 కేసులు…3,754 మరణాలు!

Monday, May 10th, 2021, 10:41:03 AM IST

india_corona
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గడిచిన 24 గంటల్లో మరో 14,74,606 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,66,161 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు కోట్ల 20 లక్షలకు చేరింది. అయితే క్రిందటి రోజుతో పోల్చితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 3,754 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,46,116 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,53,818 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య కోటి 86 లక్షలకు చేరింది. ప్రస్తుతం భారత్ లో 37,45,237 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.