తెలంగాణలో మరో 394 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, January 3rd, 2021, 11:05:16 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 40,190 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 394 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,87,502 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,549 కి చేరింది. నిన్న ఒక్కరోజే 574 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,80,565 కి చేరింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 5,388 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.