భారత్ లో మరో 38,772 కరోనా కేసులు…443 మరణాలు

Monday, November 30th, 2020, 11:55:40 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 8,76,173 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 38,772 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 94,31,691 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 443 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,37,139 కి చేరింది. నిన్న ఒక్కరోజే 45,333 మంది కరోనా వైరస్ నుండి కొలుకొగా, ఇప్పటి వరకు 88,47,600 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 4,46,952 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.