భారత్ లో తగ్గిన కరోనా కేసులు…మరో 449 మంది మృతి!

Tuesday, November 17th, 2020, 12:21:49 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే జూలై 15 తర్వాత ముప్పై వేలకు దిగువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం దేశంలో ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో మరో 8,44,382 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 29,163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 88,74,290 కి చేరింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కి ఇంకా వాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం తో కరోనా కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 449 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,30,519 కి చేరింది. అయితే కరోనా వైరస్ మరణాలు కూడా పెరుగుతూ ఉండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

అయితే కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,791 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకొగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 82,90,370 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 4,53,401 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.